శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 15, 2020 , 00:28:01

సంగారెడ్డి జిల్లాలో.. 8 మున్సిపాలిటీల్లో మొబైల్‌ టాయిలెట్లు

సంగారెడ్డి జిల్లాలో..  8 మున్సిపాలిటీల్లో  మొబైల్‌ టాయిలెట్లు

సంగారెడ్డి టౌన్‌ : మున్సిపాలిటీల్లో బహిరంగ మల, మూత్ర విసర్జనను నివారించడానికి జనాభా ప్రాతిపదికను పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని బల్దియాల్లో వీటి నిర్మాణం చేపట్టారు. పట్టణ ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక టాయిలెట్‌ నిర్మించాలని ఆదేశాల మేరకు శరవేగంగా పనులు చేపట్టారు. జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన 359 టాయిలెట్స్‌ అవసరం, కాగా.. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో 116 మరుగుదొడ్లు ఉన్నాయి. కొత్తగా 243 మరుగుదొడ్లు అవసరం ఉండగా, వాటికి కలెక్టర్‌ హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా 50శాతం మహిళలకు కేటాయించారు. 

8 మున్సిపాలిటీలకు 243 మరుగుదొడ్లు..

అమీన్‌పూర్‌ మున్సిపాలిటీకి జనాభా ప్రాతిపదికన 35 టాయిలెట్లు అవసరం. అందులో 35 నిర్మాణాలు పూర్తయ్యాయి. అందోల్‌ మున్సిపాలిటీకి 24 అవసరం కాగా, 8 ఉన్నాయి. మరో 16 మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. బొల్లారం 35 అవసరం కాగా, కొత్తగా మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. నారాయణఖేడ్‌ 18 అవసరం కాగా, ఇప్పటికే ఐదు ఉండగా.. మరో 13 నిర్మిస్తున్నారు. జహీరాబాద్‌లో 90 అవసరం ఉండగా, అందులో 45 ఇప్పటికే ఉండగా, కొత్తగా మరో 45 నిర్మాణం చేపట్టారు. సదాశివపేటలో 44 అవసరం ఉండగా, అందులో 29 ఇప్పటికే ఉన్నాయి. మరో 15 నూతనంగా మంజూరు చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 89 అవసరం. ఇప్పటికే 29 ఉండగా, 60 కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీకి 24 అవసరం ఉండగా, కొత్తగా 24 మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు మొబైల్‌ టాయిలెట్లను మంజూరు చేశారు. నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలకు వీటిని కేటాయించారు. అవి నేడు అందుబాటులోకి రానున్నాయి. 


logo