బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 13, 2020 , 23:26:22

పకృతి వనాలు త్వరగా ఏర్పాటు చేసుకోవాలి

 పకృతి వనాలు త్వరగా ఏర్పాటు చేసుకోవాలి

  • కిష్టాపూర్‌లో స్థలాన్ని పరిశీలించిన ఈజీఎస్‌ ఏపీవో సంతోష్‌రెడ్డి

తూప్రాన్‌  రూరల్‌ :  వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టి  త్వరితగతిన పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేసుకోవాలని ఈజీఎస్‌ తూప్రాన్‌ మండల ఏపీవో సంతోష్‌రెడ్డి గ్రామస్తులకు సూచించారు. మండలంలోని కిష్టాపూర్‌లో నిర్మాణం  చేపట్టబోయే పల్లె ప్రకృతివనం స్థలాన్ని గురువారం సర్పంచ్‌ పిట్ల పోయయ్యతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వీటి నిర్మాణాల ద్వారా స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు, యువకులు వాకింగ్‌ చేయడానికి, చిన్నారులు ఆట, పాటలు నిర్వహించుకునేందుకు దోహదపడుతాయి.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌ తదితరులు  పాల్గొన్నారు.


తాజావార్తలు


logo