ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 13, 2020 , 23:26:23

పట్టణాభివృద్ధికి నూతన ప్రణాళికలు

పట్టణాభివృద్ధికి నూతన ప్రణాళికలు

  •  పురపాలక చైర్మన్‌  జితేందర్‌గౌడ్‌  l పాజిటివ్‌ బాధితులను  ఆదుకుంటాం
  • l మున్సిపల్‌ అత్యవసర సమావేశంలో సభ్యుల తీర్మానం

రామాయంపేట: పట్టణ అభివృద్ధికి నూతన ప్రణాళికలను సిద్ధం చేశామని చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో సభ్యులతో అత్యవస ర సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. కరోనాతో  పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా బారిన పడ్డ కుటుంబాలను మున్సిపల్‌ నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.  మున్సిపల్‌ అభివృద్ద్ధిపై సభ్యులతో తీర్మానాలు చేయించామన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా పనులు చేస్తామన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.  సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు యాదగిరి, గజవాడ నాగరాజు, బొర్ర అనిల్‌, మల్యాల కవిత, దేవుని జయ, సౌభాగ్యలక్ష్మి, శోభ కొండల్‌రెడ్డి, చింతల భవానీ యాదగిరి, సుందర్‌సింగ్‌, కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, బిల్‌ కలెక్టర్‌ కాలేరు ప్రసాద్‌ తదితరులున్నారు.


logo