ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 13, 2020 , 23:26:23

మేలు జాతి పశుసంపదకు కేంద్ర సర్కారు కృషి

మేలు జాతి పశుసంపదకు కేంద్ర సర్కారు కృషి

  • l ప్రారంభమైన రెండో విడుత
  • l జిల్లాలో 500 గ్రామాల్లో ఈ పథకం అమలు
  • l 50వేల ఆడ పశువులకు కృత్రిమ గర్భధారణ 

సిర్గాపూర్‌ : రాష్ట్రంలో మేలు జాతి పశుసంపదను  పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘కృషి కల్యాణ్‌ అభియాన్‌' పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నది. ఈ నెల నుంచి ‘మే 2021’ వరకు ఈ పథకం లక్ష్యాన్ని నెరవేర్చి, పాడి  రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ చేపట్టనున్నది.

కృత్రిమ గర్భధారణకు..

పశు సంవర్ధక శాఖ ‘కృషి కల్యాణ్‌ యోజన’ పథకం ద్వారా ఉచితంగా కృత్తిమ గర్భధారణ చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో  గతేడాది సెప్టెంబర్‌ 26వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించి.. 200 గ్రామాల్లో 20వేల ఆడ పశువులకు కృత్రిమ గర్భధారణ  చేశారు. రెండో విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా, 500 గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో గ్రామంలో 100 పశువుల చొప్పున 50 వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంబంధిత పశువైద్యులతోపాటు గోపాల మిత్రలు ఉచితంగా సేవలను అందించనున్నారు. 

పొట్‌పల్లి దుగ్యా తండాలో రెండు మేలైన దూడల జననం..

సిర్గాపూర్‌ మండలంలోని పొట్‌పల్లి దుగ్యాతండాలో గతేడాది పాడి పశువులకు టీకాలు వేయగా, బీమ్లానాయక్‌కు చెందిన ఆవు గత నెలలో రెండు మేలైన దూడలను జన్మనిచ్చింది. దీంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు. 


logo