శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Aug 13, 2020 , 00:23:17

‘మల్లన్న’ను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్‌

‘మల్లన్న’ను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్‌

చేర్యాల : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారిని గురువారం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయానికి డిప్యూటీ స్పీకర్‌ చేరుకోగానే ఆలయవర్గాలు ఆయనకు కొవిడ్‌-19 నిబంధనల మేరకు స్వాగతం పలికాయి.అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు తన సతీమణి స్వరూప,కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే మార్గంలో ఉండే మెట్లపై డిప్యూటీ స్పీకర్‌ 101 కొబ్బరికాయలు కొట్టారు. తమ కులదైవం కొమురవెల్లి మల్లికార్జున స్వామని, చిన్ననాటి నుంచి ఆలయానికి వస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మల్లన్న ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు ముత్యం నర్సింహులుగౌడ్‌,ఆలయ సిబ్బంది ఉన్నారు. 


logo