మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 13, 2020 , 00:23:36

రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలి

రైతు వేదికలు  త్వరగా పూర్తిచేయాలి

  • l నిర్మాణ పనుల్లో జాప్యం జరుగొద్దు
  • l సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు
  • l వట్‌పల్లిలో రైతువేదిక పనులు పరిశీలన
  • l అన్నాసాగర్‌, మేడుకుంద,  నిర్జేప్లలో వైకుంఠధామాలు పరిశీలన

వట్‌పల్లి: కాంట్రాక్టర్లకు పూర్తి సహకారం అందించి కూలీలు, మేస్త్రీల కొరత రాకుండా చూడాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం వట్‌పల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా రైతు వేదికలు పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయని, వట్‌పల్లిలో మాత్రం పనులు ఎందుకు జరుగడం లేదంటూ కాంట్రాక్టర్‌, అధికారులను ప్రశ్నించారు. దీంతో కూలీలు, మేస్త్రీల కొరత తీవ్రంగా ఉన్నదని సమాధానం చెప్పారు. స్థానికంగా ఉన్న మేస్త్రీలు, కూలీలను వినియోగించోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విషయాల్లో తగు సూచనలు, సలహాలు ఇవ్వడంకోసం సరైన వేదిక ఉండాలనే సంకల్పంతో రైతు వేదికలను నిర్మిస్తున్నదన్నారు. నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు.

వైకుంఠధామాల పరిశీలన..

అందోల్‌ మండలం అన్నాసాగర్‌, వట్‌పల్లి మండలం మేడుకుంద, నిర్జేప్ల, ఉసిరికపల్లి గ్రామా ల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాల పనులను కలెక్టర్‌ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మెడుకుందలో పనులు జరుగకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలాఖారులోగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల్లో జాప్యం జరుగకూడదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. నిర్జేప్లలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. హరితహారంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేసి పెద్దఎత్తున మొక్క లు నాటేలా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జి తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీవో యూసుఫ్‌, జడ్పీటీసీ అపర్ణ, సర్పంచ్‌లు సురేఖాబుద్దిరెడ్డి, నందినివీరారెడ్డి, గంగాబాయి, ఏవో మహేశ్‌చౌహాన్‌, ఏఈవోలు సవిత, విఠల్‌రావు, కార్యదర్శి రాజలింగం, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ అశోక్‌గౌడ్‌, శివాజీరావు, నాయకులు నర్సింహులు, శ్రీకాంత్‌, రాజేందర్‌రావు  ఉన్నారు. 


logo