సోమవారం 26 అక్టోబర్ 2020
Sangareddy - Aug 12, 2020 , 02:55:44

ఏడుపాయలను హరితవనంగా తీర్చిదిద్దుతాం

ఏడుపాయలను హరితవనంగా తీర్చిదిద్దుతాం

పాపన్నపేట : ఏడుపాయలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ వెల్లడించారు. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశానుసారం ఏడుపాయలలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాస్‌ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఈవో కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఉద్యోగులతో పాటు వేద బ్రాహ్మణులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


logo