మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 12, 2020 , 02:55:46

ఇండ్లలోనే కృష్ణాష్టమి

ఇండ్లలోనే కృష్ణాష్టమి

  • అలరించిన రాధాకృష్ణులు

మెదక్‌ రూరల్‌ : మెదక్‌ పట్టణంతో పాటు మెదక్‌ మండలంలో  కృష్ణాష్టమి వేడుకలు మంగళవారం నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పాఠశాలల్లో  కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించలేకపోయారు. ఇండ్లలోనే చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులను  శ్రీకృష్ణుడి వేషధారణలతో అలంకరించి వేడుకలు నిర్వహించుకున్నారు. ఉట్టి కొట్టే వేడుకలకు దూరంగా ఉన్నారు.  సరస్వతీ శిశుమందిల్‌లోని వేణుగోపాల స్వామి దేవాలయంలో అర్చకులు శంకర్‌ శర్మ ఆధ్వర్యంలో రాధాకష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు.  

అల్లాదుర్గంలో..

అల్లాదుర్గం : మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారులు చూపరులను ఆకట్టుకున్నారు. రేగోడ్‌ మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మెదక్‌ టౌన్‌లో..

మెదక్‌ టౌన్‌ : కృష్ణాష్టమి వేడుకలను  మెదక్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో భక్తులు ఇంట్లోనే చిన్నారులకు శ్రీకృష్ణడు, గోపికల వేషధారణ వేయించి వేడుకలు చేసుకున్నారు. అనంతరం  శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు.

పాపన్నపేటలో..

పాపన్నపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో చిన్నారులను శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలంకరించారు అలాగే పలు గ్రామాల్లో ఉట్లు కొట్టారు. నాగ్సాన్‌పల్లి మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.logo