గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Aug 12, 2020 , 02:55:49

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి

  • భక్తిశ్రద్ధలతో పెద్దపట్నం

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం ఆలయవర్గాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని  గంగరేగు చెట్టు ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. వేడుకుల సందర్భంగా ఒగ్గు పూజారులు శైవ సంప్రదాయం ప్రకారం ఉట్టి కొట్టడడంతో పాటు  కృష్ణుడు, రుక్మిణి, గొల్ల భామల వేషాలు వేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి, స్వామి వారి కల్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు పట్నంమీదకు తీసుకువచ్చి  పూజలు నిర్వహించి దాటించారు. అనంతరం ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు దాటారు. అంతకుముందుకు  పురవీధుల్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, ఏఈవో గంగా శ్రీనివాస్‌, పర్యవేక్షకులు నీల శేఖర్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గు పూజారులు  పాల్గొన్నారు.logo