ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 10, 2020 , 23:22:51

ఇంటికే హోం ఐసొలేషన్‌ కిట్లు

ఇంటికే హోం ఐసొలేషన్‌ కిట్లు

సంగారెడ్డి : కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటికే హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి పీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో కౌన్సిలర్లకు హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి నియోజకవర్గానికి హోం ఐసొలేషన్‌ కిట్లు సరఫరా చేశారన్నారు. కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కరోనా తీవ్రతను తెలుసుకుంటూ మందులు వాడేందుకు వీలుగా పల్స్‌, ఆక్సిమీటర్‌, థర్మామీటర్‌, గ్లౌజులు, మాస్కులు, మందులు కిట్లలో ఉంటాయన్నారు. సంగారెడ్డి పట్టణంలో 159 మంది బాధితులు ఇంటి వద్ద హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, వారందరికీ కిట్లు అందజేసే బాధ్యత కౌన్సిలర్లదేనన్నారు. కరోనా బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సెల్ప్‌ ఐసొలేషన్‌లో ఉంటూ జాగ్రత్తగా మందులు వాడితే పది రోజుల్లో కోలుకుంటారని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయట తిరుగొద్దని, అత్యవసర పరిస్థితిల్లోనే బయటకు రావాలన్నారు. పెండ్లీలు, శుభకార్యాలు, అంత్యక్రియల్లో గుంపులు గుంపులుగా ఉంటే కరోనా కాటు వేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సదాశివపేట పట్టణం, మండలంతోపాటు సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో మంత్రి హరీశ్‌రావు సొంత ఖర్చులతో ఇంట్లో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు రామప్ప, నాని, పవన్‌ నాయక్‌, విష్ణువర్ధన్‌, నాయకులు జైపాల్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, రవి, గోవర్ధన్‌ నాయక్‌, విఠల్‌రెడ్డి, చంద్రశేఖర్‌, ప్రభుగౌడ్‌, బత్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo