సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 10, 2020 , 23:22:47

శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఝరాసంగం :  దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామిని ఎంపీ బీబీ పాటిల్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌ స్వామి వారిని దర్శించుకున్నారు.  శ్రావణ సోమవారం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ముఖద్వారం నుంచి ఆలయ  ఈవో, అర్చక సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వరస్వామికి క్షీరాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు  చేసి మొక్కులు తీర్చుకున్నారు.  ఆలయ ఆవరణలో ఈవో మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ బొగ్గుల జగదీశ్వర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంపీని ఘనంగా సన్మానించారు. బర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమంలో ఉన్న జ్యోతిర్లింగాలకు పూజలు చేసిన అనంతరం దత్తత్రేయుడి భక్తి గీతాల సీడీని ఎంపీ ఆవిష్కరించారు. ఆయన వెంట ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి, గ్రామ సర్పంచ్‌ జగదీశ్వర్‌, ఎంపీటీసీ విజేందర్‌రెడ్డి, మండల, టౌన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంగమేశ్వర్‌, ఏజాజ్‌బాబా టీఆర్‌ఎస్‌ నాయకులు  నాగన్నపాటిల్‌, నాగన్నసజ్జన్‌శెట్టి తదితరులు ఉన్నారు. 


logo