శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 10, 2020 , 00:00:38

స్వాతంత్య్రం సమరయోధులను స్మరించుకుందాం

స్వాతంత్య్రం సమరయోధులను స్మరించుకుందాం

సంగారెడ్డి: దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సమరయోధులను స్మరించుకోవడం మన కర్తవ్యమని అదనపు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణానికి చెందిన మునిపల్లి రాంచందర్‌ నివాసానికి వెళ్లి కాలనీవాసుల సమక్షంలో ఆయనకు శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అదపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశం కోసం కుటుంబాలను వదిలి పోరాటం చేసిన సమరయోధులను ప్రభుత్వం గుర్తించి సన్మానించడం గొప్ప విషయమన్నారు. కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాలతో స్వాతంత్య్ర సమరయోధులను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతిఒక్కరూ దేశభక్తి కలిగి ఉండి సమాజంలో తమ వంతు బా ధ్యతగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మెం చు నగేశ్‌, తహసీల్దార్‌ ఆశాజ్యోతి, నాయబ్‌ తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ పిల్లోడి విశ్వనాథం పాల్గొన్నారు.

జెండా ఎగురవేసిన తోపాజీ..

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నాయకులను స్మరించుకోవడం దేశ ప్రజలుగా మన బాధ్యత అని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్‌ అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఉద్యమాభివందనాలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ నంది ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వెంకట్‌రాజు, కూన సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo