బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Aug 09, 2020 , 23:32:26

నాకు మెసేజ్‌ వచ్చింది..! మీకు వచ్చిందా..?

నాకు మెసేజ్‌ వచ్చింది..!  మీకు వచ్చిందా..?

నాకు మెసేజ్‌ వచ్చింది..!  మీకు వచ్చిందా..? అని అన్ని గ్రామాల్లో రైతులు ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఓ ఊరిలో.. ఏ రకమైన పంట.. ఎన్ని ఎకరాల్లో సాగైందో గతంలో స్పష్టత ఉండేది కాదు. అధికారులు చెప్పిన లెక్కకు, పండిన పంటకు ఏమాత్రం పొంతన ఉండేది కాదు. చాలా సందర్భాల్లో పంటల కొనుగోళ్ల సమయంలో లెక్కల్లో తేడాలు వచ్చి ఇబ్బందులు ఏర్పడేవి. ఈ గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం చెక్‌పెట్టింది. ఏ ఊరిలో.. ఏ రైతు.. ఎన్ని ఎకరాల్లో .. ఏ పంట వేశాడో పక్కా సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల సాగు వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆ సమాచారాన్ని నేరుగా రైతుల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా పంపుతున్నారు. తప్పులుంటే సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నేరుగా తమ ఫోన్లకు, తాము సాగుచేసిన పంటల వివరాల సమాచారం రావడంతో రైతులు కొత్త అనుభూతి పొందుతున్నారు.     

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/న్యాల్‌కల్‌ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ ఊరిలో.. ఏ రకమైన పంట.. ఎన్ని ఎకరాల్లో సాగైందో గతంలో స్పష్టత ఉండేది కాదు. అధికారులు చెప్పిన లెక్కకు, పండిన పంటకు ఏమాత్రం పొంతన ఉండేది కాదు. చాలా సందర్భాల్లో పంటల కొనుగోళ్ల సమయంలో లెక్కల్లో తేడాలు వచ్చి ఇబ్బందులు ఏర్పడేవి. ఈ గందరగోళ పరిస్థితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. ఏ ఊరిలో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో పక్కా సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల సాగు వివరాలు సేకరించారు. అలా సేకరించిన సమాచారాన్ని నేరుగా రైతుల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా పంపుతున్నారు. తప్పులుంటే సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నేరుగా తన ఫోన్‌కు, తాను సాగుచేసిన పంటల వివరాల సమాచారం రావడంతో రైతులు కొత్త అనుభూతి పొందుతున్నారు. 

 క్లస్టర్‌ వారీగా సాగు వివరాల సేకరణ...

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని వ్యవసాయశాఖ సిబ్బంది క్లస్టర్ల వారీగా ప్రతి రైతు సాగు చేసిన పంటల వివరాలను సేకరిస్తున్నారు. దాదాపుగా సేకరణ పూర్తి కావచ్చింది. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ 118 క్లస్టర్లు, సిద్దిపేటలో 127, మెదక్‌ జిల్లాలో 77 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్‌కు ఓ వ్యవసాయ విస్తరణ అధికారి పనిచేస్తున్నారు. వారితో పాటు వ్యవసాయశాఖ అధికారులంతా కలిసి పంటల సాగు వివరాలు సేకరించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా దాదాపు సేకరణ పూర్తి కావచ్చింది. పలుచోట్ల వరిసాగు ఇంకా కొనసాగుతున్నది. ఆ లెక్కలు మినహా మిగతా అన్ని లెక్కలు వచ్చాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంటల సాగు వివరాలు నమోదు చేసుకుంటేనే, పంట పండిన తర్వాత దిగుబడులు అమ్ముకునే వీలుంటుందని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ప్రతి రైతు స్వయంగా పంటల సాగు లెక్కలు నమోదు చేయించుకున్నాడు. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశాడో వ్యవసాయ శాఖ వద్ద స్పష్టమైన వివరాలు ఇప్పుడు ఉన్నాయి. పంట పండిన తర్వాత ఎఫ్‌సీఐ, పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌, ఐకేపీ ద్వారా దిగుబడులు కొనుగోలు చేస్తారు. ఇప్పటి నుంచి వ్యవసాయ అధికారుల వద్ద సాగు లెక్కల్లో పేరు ఉన్న రైతుల పంట దిగుబడులు మాత్రమే కొనుగోలు చేయనున్నారు.


logo