ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 08, 2020 , 03:09:58

కరోనా విజృంభణ

కరోనా విజృంభణ

సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 37 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీ రాం రాథోడ్‌ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డిలో 12, కంది 3, ఇస్నాపూర్‌ 2, బీరంగూడ 2, బొల్లారం 2, అమీన్‌పూర్‌ 2, జిన్నా రం 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. చిట్కుల్‌, గుమ్మడిదల, హత్నూర మండలం మంగాపూర్‌, జహీరాబాద్‌, కొండాపూర్‌ మండలం గుంతపల్లి, కల్హేర్‌ మండలం బాచేపల్లి, నాగ్దార్‌, జోగిపేట, వట్‌పల్లి మండలం పల్వట్ల, వోడీఎఫ్‌, మునిపల్లి మండలం బూసారెడ్డిపల్లి, ఖేడ్‌లో ఒక్కో కేసు నమోదు అయిందని వైద్యాధికారులు వెల్లడించారు. 35 మంది హోం ఐసొలేషన్‌, ఇద్దరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

జిల్లాలో ఆర్‌టీపీసీఆర్‌ నమూనాల సేకరణ..

సంగారెడ్డి జిల్లాలో ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలను మొత్తం 346 మంది నుంచి సేకరించారు. ఇందులో జహీరాబాద్‌ ఏరియా దవాఖాన 135, జిల్లా దవాఖానలో 211 మొత్తం 346 శాంపిళ్లను సేకరించినట్టు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి వెల్లడించారు. 

మెదక్‌ జిల్లాలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు

మెదక్‌ : మెదక్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 15 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 354 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మెదక్‌లో ముగ్గురికి, నర్సాపూర్‌లో ఒకరికి, రామాయంపేటలో ముగ్గురికి, అల్లాదుర్గంలో ఒకరికి, పెద్దశంకరంపేటలో ఒకరికి, చేగుంటలో ఒకరికి, తూప్రాన్‌లో ఇద్దరికి, కౌడిపల్లిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

కుకునూర్‌పల్లి పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు 

కొండపాక: కుకునూర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పదిమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న ఎర్రవల్లికి చెందిన ఇద్దరిని సిద్దిపేట దవాఖానకు పంపించారు. కొడకండ్లకు చెందిన నలుగురు, కోనాయిపల్లికి చెందిన ఒకరు, పాములపర్తి మల్లన్నసాగర్‌ కెనాల్‌లో పనిచేసే వ్యక్తి ఒకరు, సిద్దిపేట నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిని హోం క్వారంటైన్‌ చేశామని సిబ్బంది తెలిపారు. 


logo