మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 07, 2020 , 00:53:30

రాష్ట్ర సాధనలో ‘సోలిపేట’పాత్ర మరువలేనిది

రాష్ట్ర సాధనలో ‘సోలిపేట’పాత్ర మరువలేనిది

పటాన్‌చెరు : రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌, దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతి పై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోలిపేట రామలింగారెడ్డి మృతిపై గురువారం ఎమ్మెల్యే ఒక ప్రకటనలో విచారం తెలిపారు. సోలిపేట రామలింగారెడ్డి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రామలింగారెడ్డి చేసిన పో రాటం చిరస్మరణీయం అని కొనియాడా రు. ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలు చరిత్ర లో నిలిచిపోతాయన్నారు. దుబ్బాక నుం చి నాలుగు సార్లు శాసన సభ్యుడిగా గెలువడం ప్రజల్లో ఆయనపై ఉన్న ప్రేమ, నమ్మకానికి నిదర్శనమన్నారు. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు మహిపాల్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘సోలిపేట’ మృతి సమాజానికి తీరనిలోటు 

ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

వట్‌పల్లి: దుబ్బాక ఎమ్మెల్యే, శాసనసభ అంచనల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి మృతి టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు యావత్‌ తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నా రు.అందోల్‌ క్యాంప్‌ కార్యాలయంలో రామలింగారెడ్డి మృతిపై సంతాపం తెలియజేసి రెండు నిమిషాలు మౌనం పా టిం చి నివాళులర్పించారు.  రామలింగారెడ్డి మృతి తనను ఎంతో కలచివేసిందన్నారు. జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేసిన రామలింగారెడ్డి ప్రజా సమస్యలపై రాజీలేనిపోరాటం చేశారని గుర్తుచేశారు. అనంతరం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నిర్వహించిన రామలింగారెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే  పాల్గొని నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ గూడెం చైర్మ న్‌ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జున్‌ గుప్తా, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు  ఉన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎమ్మెల్యే సోలిపేట

ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌:శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ దుబ్బాక ఎమ్మెల్యే పోలీపేట రామలింగారెడ్డి మృతిపట్ల ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, నాలుగు సార్లు ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తించిన  సోలిపేట మర ణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఎమ్మె ల్యే రామలింగారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

సంగారెడ్డి లో

సంగారెడ్డి : తెలంగాణ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. సోలిపేట మరణవార్త విని ఆయన కుటుం బ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో రామలింగారెడ్డి పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. ఉద్యమకారుడిగా, జర్నలిస్టు గా ఆయన కీలక భూమిక పోషించారని, దుబ్బాక నుంచి నాలుగు సార్లు శాసన సభ్యుడిగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. 

కల్హేర్‌లో

కల్హేర్‌ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. నివాళులర్పించినవారిలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, సగరుల సంఘం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు అంజయ్య సాగర్‌, మండల అధ్యక్షుడు నారాయణరావు, ఎంపీటీసీ సంగప్ప, పీఏసీఎస్‌ చైర్మన్‌ గంగారెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు , నాయకులు జలంధర్‌, బాలయ్య, సాయిలు, లక్ష్మయ్య, హన్మంత్‌రావు, ప్రశాంత్‌సాగర్‌ ఉన్నారు. 

జహీరాబాలో 

జహీరాబాద్‌ : జహీరాబాద్‌ పట్టణంలో గురువారం  టీఆర్‌ఎస్‌ నాయకులు, జర్నలిస్టులు ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


logo