మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 07, 2020 , 00:24:26

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

సంగారెడ్డి టౌన్‌/మెదక్‌: ఆరో విడుత హరితహారంలో జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆరణ్య భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను రక్షించాలన్నారు. మున్సిపల్‌, పంచాయతీ చట్టం వచ్చాక మొక్కలు నాటడం, రక్షించడం జరుగుతోందన్నారు. నర్సరీలకు కావాల్సిన సలహాలు, సూచనలు అటవీ శాఖ చేయాలని సూచించారు. వచ్చే సంవత్సరానికి అవసరమైన మొక్కల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండేండ్లకు నర్సరీలు ప్లాన్‌ చేసుకోవాలని, గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగించాలని చెప్పారు. గ్రామా లు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈవో ఎల్లయ్య, మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, కన్జర్వేటర్‌ శరవణన్‌, డీఎఫ్‌వో పద్మజారాణి, డీపీవో హనోక్‌, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.logo