శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 05, 2020 , 23:56:45

ఆదర్శ మున్సిపాలిటీగా తూప్రాన్‌ రూపుదిద్దుకోవాలి

ఆదర్శ మున్సిపాలిటీగా తూప్రాన్‌ రూపుదిద్దుకోవాలి

  •   పట్టణాభివృద్ధికి  నిరంతరం శ్రమించాలి
  •   తూప్రాన్‌లో హరితహారం మొక్కలు నాటిన     గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి  

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌  పట్టణం అన్ని  రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి చెందాలన్నదే  సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుల ధ్యేయమని గడా ప్రత్యేకాధికారి ము త్యంరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో తూప్రాన్‌ కొనసాగుతున్నందున ఆదర్శ మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవాలన్నారు. 

  మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, పట్టణ కౌన్సిలర్లు మామిండ్ల జ్యోతికృష్ణ, కుమ్మరి రఘుపతి, మామిడి వెంకటేశ్‌తో కలిసి తూప్రాన్‌ పట్టణంలోని 5వ వార్డులో బుధవారం సాయంత్రం ఆయన హరితహారం మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న  వైకుంఠధామం, డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పట్టణంలో జరుగుతున్న  మున్సిపల్‌ భవనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, అల్లాపూర్‌ టోల్‌గేట్‌  శివారులో కొనసాగుతున్న ఆర్‌అండ్‌బీ  గెస్ట్‌హౌజ్‌, వేసైడ్‌ మార్కెట్‌ యార్డుల నిర్మాణాలు త్వరితగతిన  పూర్తి చేయాలన్నారు.  ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మరింత అవగాహన పెంపొందించాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజుల వ్యవధి పెంచాలంటూ మున్సిపల్‌  చైర్మన్‌కు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, మున్సిపల్‌ ఆర్‌ఐ రమేశ్‌, వీఆర్వోలు వేణు, జయభారత్‌రెడ్డి  పాల్గొన్నారు


logo