మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 04, 2020 , 02:32:08

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రాఖీ’

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రాఖీ’

  • జిల్లాలో ఘనంగా రాఖీ పండుగ l రాఖీ పండుగపై కరోనా ప్రభావం.. l స్వీట్‌ దుకాణాలకు పెరిగిన గిరాకీ

మెదక్‌ /టేక్మాల్‌/మెదక్‌ రూరల్‌/మెదక్‌ టౌన్‌/అల్లాదుర్గం/పాపన్నపేట/పెద్దశంకరంపేట :   అక్కా చెల్లెండ్లు తమ సోదరులకు ప్రేమానురాగాలకు గుర్త్తుగా రక్షాబంధాన్ని కట్టడం ఆనవాయితీ.  జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ  సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.  అన్నదమ్ములు రక్షగా ఉండాలని అక్కాచెల్లెళ్లు ప్రేమతో రాఖీలు కట్టారు. సోమవారం ఉదయం  జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో యువతులు, మహిళలు రాఖీలు కొనేందుకు బారులు తీరారు. జిల్లాలోని మెదక్‌తో పాటు తూప్రాన్‌, నర్సాపూర్‌,  రామాయంపేట, చేగుంట, మనోహరాబాద్‌, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, టేక్మాల్‌ ఆయా మండలాల్లో రాఖీ పండుగ  ఘనంగా నిర్వహించారు. రాఖీలు కట్టడానికి వచ్చిన అక్కాచెల్లెళ్లు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అన్నయ్యలకు రాఖీలు కట్టారు. 

రాఖీ పండుగపై కరోనా ప్రభావం..

ఈ ఏడాది రాఖీ పండుగపై కరోనా  ప్రభావం పడింది. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టడానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా భయంతో ఇండ్లకే పరిమితమయ్యారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు అన్నయ్యకు రాఖీ కట్టలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. 

స్వీట్‌ దుకాణాలకు పెరిగిన గిరాకీ..

అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టిన తర్వాత స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంతో పాటు నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట, చేగుంటతో పాటు ఆయా మండలాల్లోని స్వీట్ల దుకాణాల వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. దీంతో మిఠాయి దుకాణాలకు గిరాకీ పెరిగింది.  


logo