శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Aug 02, 2020 , 00:30:06

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి కాపాడాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ రాజర్షి షా తెలిపారు. శనివారం స్థానిక 16వ వార్డులోని రుక్మిణీ థియేటర్‌ రోడ్డులో కౌన్సిలర్‌ కొత్తపల్లి శ్రీకాంత్‌ (నాని) ఆధ్వర్యంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజర్షి షా పాల్గొని కౌన్సిలర్‌, మున్సిపల్‌ సిబ్బంది కలిసి మొక్కలు నాటి.. నీరు పోశారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలు నాటితే అవి పర్యావరణాన్ని కాపాడుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవి, వైస్‌ చైర్‌పర్సన్‌ శంకరి లతా, మాజీ సీడీసీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.  

సంగారెడ్డిని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలి..

సంగారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో చెత్తను సేకరించాలని, సంగారెడ్డి మున్సిపాలిటీని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ రాజర్షి షా అన్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో అర్హులైన ఐదుగురికి తడి, పొడి చెత్త సేకరణ వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవి, వైస్‌ చైర్‌పర్సన్‌ శకంరి లత, మాజీ సీడీసీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo