శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Jul 30, 2020 , 23:12:19

మాది సంక్షేమ ప్రభుత్వం

మాది సంక్షేమ ప్రభుత్వం

  • l అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం
  • l అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి వలసలు
  • l  ప్రతిపక్షాలు ఇక కనుమరుగే..
  • l ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • l టీఆర్‌ఎస్‌లో చేరిన సంగారెడ్డి కాంగ్రెస్‌  నాయకులు, సర్పంచ్‌లు

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సం క్షేమం కోసం పనిచేస్తున్నది. సంక్షేమ పథకాలు, అభివృద్ధే పార్టీకి శ్రీరామరక్ష. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోతున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, సర్పంచ్‌లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వేలకోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్లు వెచ్చించినట్లు మంత్రి గుర్తు చేశారు. కరోనా వంటి ఆపత్కాలంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేసిందని, ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేసిందన్నారు. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిందన్నారు. ఓ వైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంటే మరో వైపు ప్రతిపక్ష పార్టీలు సర్కారుపై విమర్శలే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.  ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరడమే మంచిదని ఆ పార్టీ నాయకులు నిర్ణయించుకుంటున్నారని మంత్రి అన్నారు.  

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి.. 

మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ సంగారెడ్డి మండలం పార్టీ అద్యక్షుడు పండరినాథ్‌, ఉపాధ్యక్షురాలు కమలమ్మ, కల్పగూర్‌ సర్పంచ్‌ మంజుల, ఇర్గిపల్లి సర్పంచ్‌ మన్నె రత్నమ్మ, గౌడిచర్ల సర్పంచ్‌ విజయలక్ష్మీ కృష్ణ, నాగాపూర్‌ ఎంపీటీసీ మౌనిక నాగరాజు, కల్పగూర్‌ ఉప సర్పంచ్‌ అజయ్‌కుమార్‌, వార్డు సభ్యులు నాగమణి, ఆసిఫ్‌, వెంకట్‌, వీణ శ్రీనివాస్‌, మున్వర్‌ అలీ, ఈదులకంటి దామోదర్‌, రవీందర్‌, ఝూన్సీ రాములు, సాగర్‌ తదితరులకు మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు డీసీసీబీ ఉపాధ్యక్షులు మాణిక్యం, సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అశోక్‌, జిల్లా నాయకులు మనోహర్‌గౌడ్‌, నాయకులు రఘు, యాదగిరి, మాజీ సర్పంచ్‌లు సంగన్న, నాగన్న,జనార్థన్‌, మాజీ ఎంపీటీసీ చక్రపాణి, కంది మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ రవీందర్‌, శంకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo