మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jul 30, 2020 , 00:33:28

రైతు వేదికలతో సమగ్ర సమాచారం

రైతు వేదికలతో సమగ్ర సమాచారం

కౌడిపల్లి: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు అన్నదాతలకు సమగ్ర సమాచారాన్ని అందించేలా ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.   తునికి గ్రామంలో వెంకట్రావ్‌పేట్‌ క్లస్టర్‌కు సంబంధించిన రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రైతాంగం కోసం అనేక   సంక్షేమ పథకాలను  ప్రవేశపెట్టారని తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానంపై, లాభనష్టాలపై చర్చించుకుంటారని అన్నారు. దీనితో రైతులలో సంఘటితం పెరిగి  లాభాల బాట పడుతారని తెలిపారు. రైతులకు సలహాలు, సందేహాల నివృత్తికి ఏఈవోలు రైతువేదికలో అందుబాటులో ఉంటారని అన్నారు.   కార్యక్రమంలో సర్పంచ్‌ సాయిలు, జడ్పీటీసీ కవితాఅమర్‌సింగ్‌, ఎంపీపీ రాజునాయక్‌, ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్‌, ఏడీఏ బాబు నాయక్‌, కో-ఆప్షన్‌ సభ్యులు, ఏడీఏ పద్మావతి, తహసీల్దార్‌ రాణాప్రతాప్‌, ఏఈవో రాజశేఖర్‌, వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు పాల్గొన్నారు. 

పట్టణ అభివృద్ధిని  పరుగులు పెట్టిస్తా

నర్సాపూర్‌ రూరల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందించిన సహకారంతో నర్సాపూర్‌ పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పట్టణ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నర్సాపూర్‌ అర్బన్‌ పార్కుకు వచ్చిన సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశారని అన్నారు. మంజూరు చేసిన నిధులతో నర్సాపూర్‌ మున్సిపాలిటీని  అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.4 కోట్లతో సమీకృత మార్కెట్‌, రూ.2 కోట్లతో మున్సిపల్‌ భవనం, రూ.1 కోటితో మినీ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి పంపిస్తామని తెలిపారు. అనంతరం సమీకృత మార్కెట్‌ భవనాన్ని నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, కమిషనర్‌ రమణమూర్తి, వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, కౌన్సిలర్లు అశోక్‌గౌడ్‌, లలితాభిక్షపతి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. logo