శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Jul 28, 2020 , 02:28:47

మొక్కలు ఎండితే చర్యలు

మొక్కలు ఎండితే చర్యలు

  • సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు
  • పటాన్‌చెరు మండలంలో పర్యటన
  • అభివృద్ధి పనుల పరిశీలన

పటాన్‌చెరు : హరితహారంలో నాటిన మొక్క లు ఎండితే చర్యలు తప్పవని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం ఆ యన పటాన్‌చెరు మండల పరిధిలోని భానూర్‌, నందిగామ, కర్ధనూర్‌ గ్రామాల్లో పర్యటించారు. వైకుంఠధామాలు, హరితహారం మొక్కలు, నర్సరీలు, రైతు వేదికల పనులను ఆయన పరిశీలించా రు. రైతు వేదికల పురోగతిని ప్రత్యక్షంగా చూసి, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత ఉం డాలని సూచించారు. గ్రామాలు పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడొద్దని సర్పంచులకు చె ప్పారు. హరితహారంలో నాటిన మొక్కలన్నీ బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదికలు త్వరగా అందుబాటులోకి వచ్చేలా కాంట్రాక్టర్లు పనులు చేయాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం ధోరణితో ఉంటున్నారని, జవాబుదారిగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్‌లు గ్రామాల పా రిశుధ్యం, హరితహారం తదితర అంశాలను నిర్ల క్ష్యం చేయొద్దన్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో రవీందర్‌, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, కర్ధనూర్‌ ఉప సర్పంచ్‌ వడ్డెకుమార్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.logo