గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jul 26, 2020 , 22:32:52

గ్రామాల్లో ఇప్పటికీ చెక్కు చెదరని కట్టడాలు

గ్రామాల్లో ఇప్పటికీ చెక్కు చెదరని కట్టడాలు

కోహీర్‌ : గ్రామాల్లో కట్టిన బురుజులు ఏండ్ల నాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. గ్రామాల రక్షణలో భాగంగా వందల సంవత్సరాల క్రితం నిర్మించిన బురుజులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఎర్రరాయి, డంగ్‌ సున్నంతో కలిపి చేపట్టిన వాటి నిర్మాణం నేటికి ధృడంగా ఉన్నాయి. మండలంలోని పీచెర్యాగడి, గురుజువాడ, దిగ్వాల్‌, తదితర గ్రామాల్లో ఈ బురుజులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈ బురుజుల వద్ద సినీ పరిశ్రమలవారు సినిమా షూటింగులు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల సినీ పరిశ్రమ  పీచెర్యాగడి గ్రామంలోని బురుజుల వద్ద ‘నాయకి’ సినిమాను  చిత్రీకరించారు. పెద్దపెద్ద రాళ్లను వినియోగించి చేపట్టిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటున్నారు స్థానికులు. 

మా గ్రామంలో ఉన్న బురుజులు చాలా అందంగా ఉన్నాయి. వందల సంవత్సరాల క్రితం ఎర్రరాయితో కట్టిన బురుజులు ఇప్పటికీ  చాలా గట్టిదనంతో ఉన్నాయి. మా గ్రామానికి ఎవరు వచ్చినా ముందుగా వాటినే చూస్తరు. ఈ బురుజులను కాపాడుకుంటే చరిత్రను వచ్చే తరాలవారికి కూడా తెలియ జేయవచ్చు. -రామకృష్ణారెడ్డి, పీచెర్యాగడి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌


logo