బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jul 26, 2020 , 22:08:09

ఇమ్యూనిటీ పవరే వ్యాక్సిన్‌

ఇమ్యూనిటీ పవరే వ్యాక్సిన్‌

ఇలా కరోనాపై అవగాహన కల్పించే వ్యక్తులు ముందుకు వస్తున్నారు. ఒక్క రాములే కాదు అనేక మంది ఇప్పుడు తమకు కరోనా వచ్చిందని బహిరంగంగా చెబుతున్నారు. కరోనా వైరస్‌ అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందే ఒక వైరస్‌. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసక్రియలకు ఇబ్బంది తెచ్చే ఒక అంటువ్యాధి. ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేకున్నా, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఇమ్యూనిటీ పవర్‌ మనల్ని దాని నుంచి రక్షిస్తున్నది. కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఎంతో మంది ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇవి. 

నా వయస్సు 53 ఏండ్ల్లు. నాకు ఇరవై రోజుల క్రితం జ్వరం వచ్చింది. స్వతాహాగా వైద్యురాలైన నా కూతురు సలహాతో నేను కొవిడ్‌ -19 పరీక్షలు చేయించా. రిపోర్టులో పాజిటివ్‌ వచ్చింది. వెంటనే నన్ను హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో నా కుటుంబ సభ్యులు చేర్పించారు. మూడు రోజుల్లో జ్వరం తగ్గడంతో నన్ను డిశ్చార్జి చేశారు. హోం క్వారంటైన్‌లో ఉండాలని మాత్రలు, మందులు రాసిచ్చారు వైద్యులు. మూడు రోజుల క్రితం నా 14రోజుల హోం క్వారంటైన్‌ పూర్తయ్యింది. వైద్యులు సూచించినట్లుగా పద్నాలుగు రోజులు నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. పోషకాహారంతో పాటు వేడివేడి అల్లం, మిరియాల కాడ సేవించా. కరోనా వచ్చిందని ఎప్పుడూ భయపడలేదు. కుటుంబసభ్యుల సహకారంతో కరోనాను జయించా. ఆత్మవిశ్వాసం, ధైర్యంగా ఉంటే ఇంట్లోనూ కరోనా తగ్గుతుంది. ఇది నా అనుభవంతో చెబుతున్నా. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ వాడాలి. భౌతికదూరం పాటించాలి. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నా. - తెనుగు రాములు, ఘనపూర్‌, పటాన్‌చెరు మండలం 

పటాన్‌చెరు : కరోనా బారిన పడి కోలుకున్న వారు ఇప్పుడిప్పుడే ధైర్యంగా ముందుకు వచ్చి తోటి వారికి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందే ఒక వైరస్‌ అని, దీని బారిన పడినవారు అనవసరంగా భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటున్నారు. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసక్రియలకు ఇబ్బంది తెచ్చే ఒక అంటువ్యాధి ఇదని, ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేకున్నా, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఇమ్యూనిటీ పవర్‌ మనల్ని దాని నుంచి రక్షిస్తుందని అంటున్నారు కరోనా నుంచి కోలుకున్నవారు.  

భయపడితే.. 

కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే బాధితుడి కుటుంబీకులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువగా భయాందోళన చెందుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కరోనా అనేది వెంటాడే వైరస్సే అని చెప్పవచ్చు. ఈ వైరస్‌ నుంచి పారిపోవడం కాకుండా ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్న సలహాలు, సూచనలు పాటించాలి. ప్రజల్లో కరోనాపై శాస్త్రీయ పరిజ్ఞానం కంటే సోషల్‌ మీడియాలో వస్తున్న దృష్ప్రచారాలే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. జ్వరం అనగానే ప్రభుత్వం అంబులెన్స్‌లో ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేసి పాజిటివ్‌నా, నెగెటివ్‌నా అని తెలిపి బాధితులకు డాక్టర్లు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. సాధారణ జలుబు, జ్వరం అయితే తక్షణం పంపిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ అయితే వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ఇంటికి పంపుతున్నారు. ఇంట్లో హోం క్వారంటైన్‌ కావాలని సూచిస్తున్నారు.

క్వారంటైన్‌లోనే త్వరగా కోలుకుంటున్నారు..

హోం క్వారంటైన్‌లో ఉన్నవారు దవాఖానల కంటే వేగంగానే కోలుకుంటున్నారు. ఇది స్వయంగా బాధితులు చెబుతున్న మాట. ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిలో నివాసం ఉంటూ, కుటుంబ సభ్యుల సహకారంతో వారు కరోనా నుంచి వారం రోజుల్లోనే బయటపడుతున్నారు. ఇంటి బెంగ లేకపోవడం, కంటి ముందు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కనిపిస్తుండటంతో వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం లేదు. క్వారంటైన్‌ ఉన్న ఇంటిని అధికారులు కంటైన్‌మెంట్‌ చేసినా, సొంత ఇంట్లో ఉండటమనేది బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లకుండా చేస్తున్నది. సమయానికి ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు రోగి ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఇప్పటికే పెద్దసంఖ్యలో కరోనా బాధితులు ఇండ్లలో ఉండి కోలుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితుల ఆరోగ్యంపై ఆరాతీయడం కనిపిస్తున్నది. రోగులు నిత్యం యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతున్నది. విధిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించాలి. చేతులు తరుచూ సబ్చుతో కడుక్కోవాలి. సా ధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుం డా చూసుకుంటే మేలు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉం టే ఇమ్యూనిటీ పవర్‌ పెరిగి కరోనా నుంచి కోలుకోవచ్చు.


logo