ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 26, 2020 , 02:03:00

కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఎండీ ముబీన్‌

కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు  స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఎండీ ముబీన్‌

  • l కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌ అండ్‌ డీసీజీఈ  అనుమతితో వ్యాక్సిన్‌ ట్రయల్‌కు వలంటీర్‌గా ఎంపిక
  • l క్లినికల్‌ ట్రయల్స్‌లో కోలుకుని నిమ్స్‌లో చికిత్స  

రామాయంపేట : కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు రామాయంపేటవాసి ఎండీ ముబీన్‌ ఎంపికయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో రాష్ట్రంలో నాలుగో వ్యక్తిగా నిలిచాడు. శనివారం కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆప్‌ ఇండియా ఇచ్చిన అనుమతితో భారత్‌ బయోటెక్‌ ఆధ్వర్వంలో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో  వ్యాక్సిన్‌ తీసుకుని కోలుకున్నాడు. ముబీన్‌ బుధవారం   నిమ్స్‌ దవాఖానకు ఫోన్‌ చేసి స్వయంగా వెళ్లి సంప్రదించాడు. నిమ్స్‌ వైద్య బృందం అన్నిరకాల పరీక్షలు చేసేందుకు నమూనాలను తీసుకుని,  ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఢిల్లీకి పంపింది. శుక్రవారం ముబీన్‌కు నిమ్స్‌ వైద్య బృందం ఫోన్‌చేసి మీరు అర్హులని, రావాల్సిందిగా తెలిపింది.   శనివారం ఉదయం కరోనా వ్యాక్సిన్‌ టీకా ప్రయోగం చేశారు. పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో నిమ్స్‌ వైద్యులు అభినందించినట్లు వ్యాక్సిన్‌ ట్రయల్‌కు ఎంపికైన ముబీన్‌ తెలిపారు. 

వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఎంపిక కావడం అభినందనీయం

-రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌

కరోనా వ్యాక్సిన్‌కు ముబీన్‌ ఎంపికై, ఆరోగ్యంగా కోలుకోవడం అభినందనీయమని రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధైర్యంగా వెళ్లి టీకా ఇప్పించుకోవడం మెదక్‌ జిల్లాకే గర్వకారణమన్నారు. సమావేశంలో సరాఫ్‌ యాదగిరి, దేమె యాదగిరి, చింతల యాదగిరి, స్వరాజ్‌, శ్యాంసుందర్‌, శ్రీనివాస్‌, నాగరాజు, కృష్ణాగౌడ్‌ పాల్గొన్నారు.


logo