మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jul 25, 2020 , 01:28:14

నిలిచిన తెల్లరక్త కణాలు

నిలిచిన తెల్లరక్త కణాలు

  • n ట్రాన్స్‌ ప్ల్లాంటేషన్‌ చేయాలన్న వైద్యులు
  • n ఆపరేషన్‌కు రూ.12 లక్షలు 
  • n ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చు
  • n చిన్నారిని చూసి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
  • n దాతల సాయం కోసం ఎదురుచూపు

తోటి స్నేహితులతో ఆనందంగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి అనారోగ్యంతో పోరాడుతోంది. తెల్ల రక్త కణాలు నిలిచిపోయాయి.. ట్రాన్స్‌ ప్ల్లాంటేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. ఖర్చు రూ.12 లక్షలవుతుందని చెప్పగానే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పేద కుటుంబానికి చెందిన ఆ అమ్మానాన్నలు ఉన్నదంతా ఊడ్చి ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చు చేశారు. ఇక చేసేది లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆదుకునే దాతలే చిట్టితల్లి పాలిట దేవుళ్లు అని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

న్యాల్‌కల్‌ : మండలంలోని గంగ్వార్‌ గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్‌, అలివేణిలది పేద కుటుంబం. శ్రీనివాస్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ  కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు, కూతురు. ఐదేండ్ల కూతురు వెంకట ప్రసన్న అనారోగ్యానికి గురి కావడంతో పలు దవాఖానలకు తిరిగినా ఆరోగ్యం మెరుగుపడలేదు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికా క్యాన్సర్‌ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి, శరీరంలో తెల్లరక్త కణాల ఉత్పత్తి నిలిచిపోయిందని నిర్ధారించారు. తెల్ల రక్త కణాలను వెన్నుముకలో ట్రాన్స్‌ ప్ల్లాంటేషన్‌ ద్వారా ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు. దానికి రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. దేవుడా నీవే దిక్కంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మానవతా ధృక్పథంతో వైద్యులు  వారి కుమారుడికి పరీక్షలు చేశారు. తెల్ల రక్తకణాలు సరిపోతాయని, కూతురుకు ట్రాన్స్‌ప్ల్లాంటేషన్‌ చేసేందుకు దాదాపు రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చి రూ. 4 లక్షల ఖర్చు చేసిన తల్లిదండ్రులు, చేసేదేమి లేక ఆదుకునే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు లేదా ప్రభుత్వ సాయం కోసం ఆ తల్లిదండ్రులు అర్థిస్తున్నారు.  

సాయం అందించాలనుకుంటే...

సాయం అందించాలనుకునే దాతలు... చిన్నారి వెంకట ప్రసన్న తల్లి అలివేణి జహీరాబాద్‌లోని ఎస్‌బీఐ అకౌంట్‌ నెం 30706059198. IFSC CODE .SBIN0007951, చిన్నారి తల్లి అలివేణి GOOGLE PAY -NUMBER -9666497801కు జమ చేయాలని , లేదా సంప్రదించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.


logo