ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 24, 2020 , 01:39:31

నాణ్యమైన చదువులకు కేంద్రం తెలంగాణ

నాణ్యమైన చదువులకు కేంద్రం తెలంగాణ

పటాన్‌చెరు : నాణ్యమైన చదువులకు కేంద్రం తెలంగాణ అని, రాష్ట్రంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్‌చెరు పట్టణంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పటిష్టమైన విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయడంతోపాటు సర్కారు విద్యను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పటాన్‌చెరు ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతున్నదని, కేజీ టు పీజీ వరకు పటాన్‌చెరులోనే చదివేలా విద్యాభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న విద్యాసంస్థలు పటాన్‌చెరులో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు బాటలు వేస్తామన్నారు.  కార్యక్రమంలో ఎంఈవో పీపీ రాథోడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వంగరి అశోక్‌, హెచ్‌ఎం సీతాలక్ష్మి, నస్రిన్‌ సుల్తానా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దేవాలయాల అభివృద్ధికి కృషి 

అమీన్‌ఫూర్‌ : నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని లింగమయ్యకాలనీలో సీతారామాంజనేయస్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మిస్తున్న దేవాలయాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపారు. ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీతారామాంజనేయస్వామి దేవాలయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ లింగమయ్యకాలనీలో నిర్మిస్తున్న సీతారామాంజనేయ స్వామి దేవాలయం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందారం నరసింహాగౌడ్‌, కౌన్సిలర్లు కొల్లూర్‌ మల్లేశ్‌, మల్లేశ్‌, కృష్ణ, నవనీత జగదీశ్‌, ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo