గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jul 24, 2020 , 01:27:06

‘నారింజ’తో భూగర్భ జలాలు పెంపు

 ‘నారింజ’తో  భూగర్భ జలాలు పెంపు

జహీరాబాద్‌ : భూగర్భ జలాలు పెంచడంతో పాటు వ్యవసాయానికి సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బి)లో నారింజ ప్రాజెక్టును పరిశీలించారు, జహీరాబాద్‌లో రైతు సేవాకేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్‌లో కొత్త వాహనాలు ప్రారంభించి, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. నారింజ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి 85 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టుకు కొత్తగా గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, నీటిపారుల శాఖ అధికారులకు ఆదేశిం చారు. నారింజ ప్రాజెక్టు నీరు కర్ణాటక వైపు పోకుండా  చెక్‌డ్యాం  నిర్మాణానికి సర్వే చేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. నారింజ ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండటంతో 10 కిల్లోమీటరు దూరం వరకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు.

 తక్కువ ధరకు ఎరువులు అమ్మకాలు

రైతు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేసి తక్కువ ధరకు ఎరువులు అమ్మకాలు చేసేందుకు డీసీఎంఎస్‌ కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.  మెదక్‌, గజ్వేల్‌లో రైతు సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు పోలీసుస్టేషన్‌ ముందు క్యూలైన్‌లో నిలిచి ఉండేవారని తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు.

జహీరాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధికి కృషి

జహీరాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి తెలిపారు.  జహీరాబాద్‌లో రూ.23 కోట్లతో మిషన్‌ భగీరథ  పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. సంగారెడ్డికి మున్సిపల్‌లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ. 11.5 కోట్లు, సదాశివపేటకు రూ. 25 కోట్లు మంజూరు చేశామన్నారు. జహీరాబాద్‌ మున్సిపల్‌ విద్యుత్‌ శాఖకు రూ. 63 కోట్లు బిల్లులు చెల్లించాలని, ప్రతి నెలా కరెంట్‌ బిల్లులు తగ్గించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మున్సిపల్‌ ఆదాయం పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మున్సిపల్‌లో చెత్త సేకరించేందుకు 30 వాహనాలు ప్రారంభించారు. 

 హోమియో  మందలు పంపిణీ

జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ హోమియోకేర్‌ మందులు పంపిణీ చేసేందుకు ఎంపీ బీబీ పాటిల్‌ ముందుకు రావడం  సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ , ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ, కలెక్టర్‌ హనుమంతరావు, రాష్ట్ర మున్సిపల్‌   అధికారి సత్యనారాయణ, ఆడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షి షా, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, రైల్వే బోర్డు సభ్యులు షేక్‌ ఫరీద్‌, జహీరాబాద్‌ ఆర్‌డీవో రమేశ్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.logo