శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sangareddy - Jul 24, 2020 , 01:10:44

చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైం

చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైం

చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందని, ప్రజలకు పథకాలు సరిగ్గా అందుతున్నాయని, కార్యక్రమాలు బాగా అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నూతనంగా ఏర్పడిన అందోల్‌-జోగిపేట రెవెన్యూ డివిజన్‌(ఆర్డీవో) కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..  ఎమ్మెల్యే క్రాంతి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి డివిజన్‌ను  సాధించారని మంత్రి అభినందించారు. కొత్త మండలంగా ఏర్పాటైన చౌటకూర్‌లో తహసీల్‌ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. జహీరాబాద్‌ మండలం కోత్తూర్‌(బి)లోని నారింజ ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. జహీరాబాద్‌లో రైతుసేవా కేంద్రాన్ని ప్రారంభించారు.  మున్సిపాలిటీలో కొత్త వాహనాలు ప్రారంభించి మున్సిపల్‌ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.  సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తానని అన్నారు.        

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ) / వట్‌పల్లి : సీఎం కేసీఆర్‌ కృషితో ఏర్పడిన చిన్న జిల్లాలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. గురువారం నూతనంగా ఏర్పడిన అందోల్‌-జోగిపేట రెవెన్యూ డివిజన్‌ (ఆర్డీవో) కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభలో మంత్రి మాట్లాడారు. గతంలో మండల కేంద్రాలకు పలు జిల్లా కేంద్రాలు 2 వందల కిలోమీటర్లు ఉండేదని దీంతో ప్రజలు జిల్లా కేంద్రాలకు వచ్చి పనులు చేసుకోవాలంటే ఒకరోజు గడిచేదని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్‌ పారిపాలనా సౌలభ్యం కోసం చిన్నజిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశారని, దీంతో దగ్గరలో కార్యాలయాలు ఏర్పడి ప్రజలు నేరుగా అధికారులను కలుసుకునే వీలు కలిగిందని చెప్పారు. ఎమ్మెల్యే క్రాంతి మొండి మనిషని, కష్టపడేతత్వం చూస్తే ముచ్చటేస్తుందని మంత్రి అభినందించారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పడే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా  వెంటపడ్డారని అభినందించారు. అందోల్‌-జోగిపేట రోడ్లను నాలుగులేన్లుగా ఏర్పా టు చేసి డివైడర్లు, లైట్లు అమర్చి  సర్వాంగా సుందరంగా తీర్చిదిద్ది నియోజకవర్గానికి కొత్త రూపు తీసుకువస్తానని మంత్రి అ న్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాట్లాడు తూ ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, మున్సిపల్‌ చైర్మ న్‌ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్లు మల్లికార్జున్‌, రజనీకాంత్‌, మార్కుఫెడ్‌ డైరెక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమే శ్‌, నాయకులు జైపాల్‌రెడ్డి, రాహుల్‌కిరణ్‌, భిక్షపతి, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.    logo