శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Jul 22, 2020 , 00:01:16

అధైర్యపడకండి... అండగా మేమున్నాం

అధైర్యపడకండి... అండగా మేమున్నాం

కొల్చారం: అధైర్యపడకండి... అండగా మేమున్నాం... మరణించిన వారి జ్ఞాపకార్థం మొక్కను నాటి, వారి జ్ఞాపకాలను ఆ మొక్కలో చూసుకోవాలని  కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పోతంశెట్‌పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ సం తోష్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  ప్రమాదవశాత్తు ఎవరైనా మృతి చెందితే  ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం నివేదికతో పాటు ఏవైనా ధ్రువపత్రాలు అవసరముంటే వారి ఇంటి వద్దకే వెళ్లి అందించే వినూత్న పథకాన్ని  రోడ్డు ప్రమాద మృతుడు సంతోష్‌ ఇంటివద్ద  ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నాగరాణి, ఎంపీటీసీ భాగ్యలక్ష్మిలతో కలిసి మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి తన కుటుంబాన్ని,  సమాజాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా పుట్టినరోజు కానీ, శుభకార్యాలు నిర్వహించేటప్పుడు కొన్ని మొక్కలను నాటితే భావితరాలకు బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు కె.యాదాగౌడ్‌, చిట్యాల యాద య్య, ఏడుపాయల డైరెక్టర్‌ గౌరీశంకర్‌,  దుర్గేశ్‌, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.  

అందుబాటులో   హరితహారం మొక్కలు 

చేగుంట:  హరితహారంలో నాటేందుకు మొక్కలు నర్సరీలలో అందుబాటులో ఉన్న ట్లు చేగుంట ఎంపీడీవో ఉ మాదేవి పేర్కొన్నారు.  పోత న్‌శెట్టిపల్లి, పెద్దశివునూర్‌, చిన్న శివునూర్‌ గ్రామాల్లోని నర్సరీలను, సెగ్రిగేషన్‌ షెడ్‌లను పరిశీలించారు.  ఎంపీడీవో మాట్లాడుతూ ఆరో వి డుత  హరితహారంలో భాగం గా  కాలువ, చెరువుగట్లపైన ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా  మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్‌లో తడి, పొడి చెత్తకు వేర్వేరుగా కుండీలు ఏర్పాటు చేశామని, వాటిద్వారా సేంద్రియ ఎరువును తయారు చేస్తామని ఉమాదేవి తెలిపారు. ఆమె వెంట సర్పంచ్‌లు కొటారి అశోక్‌, ముదాం రుక్మిణి,నెల్లూర్‌తో పాటు పలువురు ఉన్నారు.

కర్నాల్‌పల్లిలో గడ్డి మందు పిచికారీ

చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో  సర్పంచ్‌ సంతోష్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జగదీశ్‌, వార్డు సభ్యులు గ్రామంలో కలుపు మొక్కలకు గడ్డి మందును పిచికారీ చేయించారు.

మక్కరాజిపేటలో పారిశుధ్య పనులు.. 

మక్కరాజిపేటలో  సర్పంచ్‌ కుమ్మరి శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి ఎల్లం మురికి కాలువల నుంచి తీయించిన చెత్తను ట్రాక్టర్‌ద్వారా తరలించి పారిశుధ్య పనులను  చేపట్టారు.  వడియారంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు బక్కిరమేశ్‌, కార్యదర్శి వెం కటనర్సింహారెడ్డి మొక్కలు నాటి  జాలీలను ఏర్పాటు చేశారు.


logo