శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jul 21, 2020 , 22:59:01

‘నారింజ’లో భారీగా వరద

‘నారింజ’లో భారీగా వరద

జహీరాబాద్‌ : నారింజ ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతోంది. రెండు రోజులుగా జహీరాబాద్‌, కోహీర్‌ మండలాల్లో వానలు కురవడంతో వరద వస్త్తోంది. నారింజ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 85 ఎంసీఎఫ్‌టీ (మిలియన్‌ క్యూబిక్‌ మీటర్స్‌) ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 63 ఎంసీఎఫ్‌టీలు ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 22 ఎంసీఎఫ్‌టీల వరద  చేరితే ప్రాజెక్టు సామర్థ్యం పూర్తిగా నిండుతుంది.  కర్ణాటక వైపు వరద పోకపోవడంతో పలు మార్లు బీదర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు నారింజ ప్రాజెక్టును సందర్శించి వెళ్లారని అధికారులు తెలిపారు. కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు రాత్రి సమయంలో గేట్లు తొలిగించే అవకాశముందని, దీంతో 24 గంటల నీటిపారుదల శాఖకు చెందిన సిబ్బందిని పర్యవేక్షణ కోసం నియమించామని అధికారులు తెలిపారు. జహీరాబాద్‌ రూరల్‌ పోలీసులకు సైతం సమాచారమిచ్చారు. ఈఏడాది ప్రభుత్వం నారింజ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంతో వరద నిల్వ ఉంటున్నది. దీంతో జహీరాబాద్‌ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణకు సిబ్బందిని నియమించాం..

నారింజ ప్రాజెక్టులో వరద నిల్వ ఉండటంతో 24 గంటలు నీటిపారుదల శాఖ సిబ్బందిని పర్యవేక్షణకు నియమించాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 63 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉన్న ది. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. -రమణారెడ్డి. నీటిపారుదల శాఖడీఈఈ జహీరాబాద్‌logo