గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jul 20, 2020 , 00:00:48

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో ఆదివారం ఒక్క రోజు కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశిపేట, ఓతేజి, తెల్లాపూర్‌, ఇస్నాపూర్‌, పటాన్‌చెరు, ఇంద్రకరణ్‌, గుండ్లమాచునూర్‌, మారేపల్లి, చిద్రుప్ప, ఓడీఎఫ్‌, గుమ్మడిదల, బొంతపల్లి, అమీన్‌పూర్‌లలో కరోనా   కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 35 మంది హోం ఐసొలేషన్‌, 10 మంది దవాఖానల్లో చికిత్స  పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. కరోనా ప్రభలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు. 

మెదక్‌ జిల్లాలో రెండు కరోనా కేసులు 

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం శాలిపేట, నర్సాపూర్‌ మండలం మంతూర్‌ గ్రామాల్లో కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు.   

కాళేశ్వరం కార్యాలయంలో కరోనా టెస్టులు  

చిన్నకోడూరు : పెద్దకోడూరు శివారు రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ పల్లగుట్టపై ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌ కార్యాలయంలో ఆదివారం ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేసినట్లు కాళేశ్వరం ఎస్‌ఈ ఆనంద్‌ తెలిపారు.  


logo