సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jul 18, 2020 , 23:35:04

సంగారెడ్డి కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

 సంగారెడ్డి కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

హత్నూర : హత్నూర మండలంలో శనివారం సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు సుడిగాలి పర్యటన చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయడంతోపాటు సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. హత్నూర మండలంలోని కాసాల, దౌల్తాబాద్‌, బ్రాహ్మణగూడ, రెడ్డిఖానాపూర్‌, దేవులపల్లి, నాగుల్‌దేవులపల్లి, సిరిపుర, లింగాపూర్‌,  దేవునిగుట్టతండా, తెల్లరాళ్లతండాలను సందర్శించారు. ఆయాగ్రామాల్లో డంపింగ్‌యార్డులు,  వైకుంఠధామాల నిర్మాణ పనులను పరిశీలించి, హరితహారం అమలుపై ఆరాతీశారు.  

  షోకాజ్‌ నోటీసులు జారీ :   దౌల్తాబాద్‌ గ్రామపంచాయతీలో వైకుంఠధామాల నిర్మాణంలో జాప్యంచేయడంతో పాటు హరితహారం, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శి నసీరుద్దీన్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు సర్పంచ్‌ వెంకటేశానికి షోకాజ్‌ నోటీసు జారీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.   విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్య లు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో రవి, సీపీవో మనోహర్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో సువర్ణ, తహసీల్దార్‌ జయరాం, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.


logo