గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Jul 18, 2020 , 23:30:24

‘గుంపు’ ముంగిట.. ముప్పు

‘గుంపు’ ముంగిట.. ముప్పు

కరోనా కోరలు చాస్తున్నది. ప్రాణాలను బలిగొంటున్నది. ఈ పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భౌతిక దూరం పాటించడమే కరోనాకు రక్ష అని వైద్యులు, అధికారులు మొత్తుకుంటున్నారు. కానీ, కొందరికి చెవికెక్కడం లేదు. గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. మాస్క్‌లు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యంతో కరోనా బారినపడే ప్రమాదం ఉందని తెలిసినా, ఏమాత్రం భయపడడం లేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద జనం గుమిగూడి కనిపిస్తున్నారు. కూరగాయల మార్కెట్లు, మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద జనం ఎక్కువగా భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో ముప్పు పొంచి ఉంది. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరుచూ శానిటైజ్‌ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.