ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jul 16, 2020 , 23:15:20

సాగు ఇలా.. రైతు భళా

సాగు ఇలా.. రైతు భళా

  • కిష్టాపూర్‌లో సైకిల్‌తో దంతె పనులతో రైతు ఉడుం కృష్ణ
  • కలుపు మొక్కలు, గడ్డి తొలిగింపు

తూప్రాన్‌ రూరల్‌ : వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవడం కోసం కొంతమంది రైతులు వినూత్న తరహాల్లో వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తున్నారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా ఖర్చులు తగ్గించుకోవడం కోసం రైతులు ఆరాట పడుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించాలన్న ఉద్దేశం రైతాంగంలో కనిపిస్తున్నది. తూప్రాన్‌ మండలం కిష్టాపూర్‌కు చెందిన ఉడుం కృష్ణకు గ్రామ శివారుల్లో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో అర ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ప్రభుత్వ సూచనల మేరకు అర ఎకరంలో ఆయన పత్తి పంటను వేశాడు. పొలంలో విత్తనాలు చల్లాక, మొక్కల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలు, గడ్డిని తొలగించాల్సి వచ్చింది. నాగళ్ల ద్వారా దంతెను చేపట్టడం, కూలీలతో కలుపు, గడ్డిని తొలగిస్తే వాటికి ఖర్చులు అధికమవుతాయని భావించి, తనకున్న సైకిల్‌ వెనుక చక్రాన్ని తొలగించి దంతె పరికరాన్ని అమర్చారు. పత్తి చేనులో పెరిగిన కలుపు మొక్కలు, గడ్డిని దంతెతోనే కలుపు మొక్కలు, గడ్డిని తొలగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. కలుపు మొక్కలు, గడ్డిని నాగళ్లు, కూలీలతో తొలగిస్తే సుమారు రూ. 5 వేల వరకు ఖర్చవుతుంది. తన సైకిల్‌కు అమర్చుకున్న దంతె పరికరానికి రూ.100 ఖర్చయింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్నాదే నా ఉద్దేశ మని రైతు కృష్ణ చెప్పుకొచ్చారు. 


logo