గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jul 14, 2020 , 23:54:30

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించాలి

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించాలి

  • ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఆర్డీవో సూచన

జహీరాబాద్‌ : ముంబై-హైదరాబాద్‌ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబు సూచించారు. సోమవారం రాత్రి జహీరాబాద్‌ సమీపంలోని అల్గోల్‌ చౌరస్తాలోని బైపాస్‌ రోడ్డును నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ అధికారులతో కలిసి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. బైపాస్‌ రోడ్డులోని అల్గోల్‌ చౌరస్తా వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, నివారణ చర్యలు తీసుకోవాలని ఆర్డీవో తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్‌, ఫ్లైఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కంకోల్‌ టోల్‌ గేటు వద్ద వాహనాలు గంటల తరబడి నిలువకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


logo