బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jul 14, 2020 , 23:54:31

ప్రభుత్వ రుణాలపై అవగాహన కల్పించాలి

ప్రభుత్వ రుణాలపై అవగాహన కల్పించాలి

  • సమావేశంలో మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ : ఆయా బ్యాంకుల రుణాల మంజూరీలో ఎక్కువ మంది అర్హులు ఉన్నప్పటికీ లబ్ధిదారులందరికీ చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రుణాల ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బ్యాంకులు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నారు. వీటితో పాటు పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాల గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలను రెన్యువల్‌ చేయడంలో వేగం పెంచాలని, ప్రతి బ్యాంకు తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని రుణాల పంపిణీ పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. జిల్లా అధికారులు బ్యాంక్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించిన రుణాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేయాలని కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాల మంజూరుకు సంబంధించిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. పాల ఉత్పత్తి మరింత పెరిగేలా రైతులకు పాడిగేదెలపై రుణాలు అందించాలని  సంబంధిత అధికారులకు సూచించారు.  ముఖ్యంగా నిరుద్యోగ యువ తీ, యువకులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందజేస్తుందని వీటి మంజూరుకు బ్యాం కర్లు కృషిచేయాలన్నారు.  అనంతరం వార్షిక రుణ ప్రణాళిక 2020-2021 బుక్‌ రిలీజ్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రామకృష్ణారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దేవయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ కృష్ణమూర్తి, జిల్లాలోని ఆయా బ్యాంక్‌ల అధికారులు పాల్గొన్నారు. 


logo