శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sangareddy - Jul 14, 2020 , 03:39:35

జిన్నారం మండలం నెంబర్‌1

జిన్నారం మండలం నెంబర్‌1

  • l  వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు పూర్తయిన     మొదటి మండలంగా రికార్డు
  • l  అధికారులు, ప్రజాప్రతినిధులకు  సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అభినందనలు

జిన్నారం: డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు వందశాతం పూర్తయిన మొదటి మండలంగా జిన్నారం నిలిచిందని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు.  ఇందుకు టీం లీడర్‌గా ఉన్న ఎంపీడీవో సుమతి, సహకరించిన తహసీల్దార్‌, మండల ప్రత్యేకాధికారి ప్రసాద్‌, ప్రజాప్రతినిధులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోనే ఈ స్థాయిలో పనులు జరగడం జిన్నారం మండలం ముందు వరుసలో ఉందన్నారు. సోమవారం   కలెక్టర్‌  జిన్నారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మా దారం, కొడకంచి, జిన్నారం, సోలక్‌పల్లి గ్రామాల్లో నిర్మించిన డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలను పరిశీలించి, మొక్కలు నాటారు.   గ్రామా లు పచ్చదనంతో అద్భుతంగా ఉన్నాయని సర్పంచ్‌లు సరిత, శెట్టి శివరాజ్‌లను అభినందించారు.  అనంతరం జిన్నారం శివారులోని వైకుంఠధామాన్ని పరిశీలించి సర్పంచ్‌ లావణ్యను అభినందించారు. ఆయన వెంట ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్‌ కార్యదర్శులు, ఆయా గ్రామాల నేతలు, అధికారులు ఉన్నారు. 


logo