శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jul 12, 2020 , 23:27:31

హరిత పటాన్‌చెరుకు కృషి

హరిత పటాన్‌చెరుకు కృషి

పటాన్‌చెరు : హరిత పటాన్‌చెరుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే  మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని కృషి డిఫెన్స్‌ కాలనీలో ఎమ్మెల్యే  మొక్కలు నాటి, మాట్లాడారు.   కొత్త కాలనీల్లో పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  పటాన్‌చెరులో ఒకప్పుడు కాలుష్య సమస్య ఉండేదని, ఇప్పుడు తగ్గుతోందన్నారు.  కాలనీవాసుల సౌకర్యార్థం వేయించిన బోరుబావులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మర్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారిక, నాయకులు మెట్టుకుమార్‌యాదవ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

రామచంద్రాపురం  ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని భెల్‌ సీఐఎస్‌ఎఫ్‌ విభాగం అసిస్టెంట్‌ కమాండెంట్‌ అరబింద చక్రవర్తి అన్నారు. ఆదివారం భెల్‌ సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా 210 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలన్నారు. నాటే ప్రతి మొక్క భావితరాల మనుగడకు ఉపయోగపడుతుందన్నారు. మానవుడి స్వార్థప్రయోజనాల కోసం చెట్లను నరికివేస్తుండడంతో అడవుల శాతం తగ్గిపోయిందన్నారు. పచ్చని పంటలతో తెలంగాణ సస్యశ్యామలం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అడవుల శాతం పెరిగితే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్నారు. ఆకుపచ్చ తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సీఎం కేసీఆర్‌ కలను నిజం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్‌రావు, కృష్ణారావు, పీకే నందో, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo