గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jul 12, 2020 , 01:29:56

విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో శనివారం కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డి 2, పటాన్‌చెరు 2, ఝరాసంగం కుప్పనగర్‌ 1, అమీన్‌పూర్‌ 2, బొంతపల్లి 1, ఐడీఏ బొల్లారం 1, ఆర్‌సీపురం 1 మొత్తం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

వెంకట్‌రెడ్డినగర్‌లో ఒకరికి కరోనా 

బొల్లారం : మున్సిపల్‌ పరిధిలోని వెంకట్‌రెడ్డినగర్‌లో వ్యక్తి(26)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు శనివారం మున్సిపల్‌ ఆర్వో శ్రీధర్‌ తెలిపారు. తోటి ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చిన కారణంగా కొండాపూర్‌ ఏరియా దవాఖానలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కుమార్‌ కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. 

మంగంపేటలో యువతికి...

జిన్నారం : మండలంలోని మంగంపేట గ్రామానికి చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సూరారంలోని మల్లారెడ్డి దవాఖానలో పని చేస్తున్నది. ఆమె కుటుంబీకులను హోం క్వారంటైన్‌ చేశారు. 

అందోల్‌లో ఒకరికి... 

వట్‌పల్లి : అందోల్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తాలెల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన రక్త పరీక్షల్లో పాజిటివ్‌ రాగా, సన్నిహితంగా ఉన్న 22మందిని క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. 

ఝరాసంగం మండలంలో ఇద్దరికి..

ఝరాసంగం : మండలంలోని కుప్పానగర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి(42)కి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జూన్‌ 25వ తేదీ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో జూలై 8వ తేదీన రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు చేయగా, శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ మాజీద్‌ తెలిపారు. మండల పరిధిలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. 

మెదక్‌లో నలుగురు, పాపన్నపేటలో ఒకరు, తూప్రాన్‌ మండలం ఘనపూర్‌లో ఒకరు.. 

మెదక్‌ : జిల్లా కేంద్రంలో నాలుగురికి, పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌లో ఒకరికి, తూప్రాన్‌ మండలం ఘనపూర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రావాలని సూచించారు.

చేగుంట మండలంలో ముగ్గురికి...

చేగుంట : మండల కేంద్రం చేగుంట సమీపంలోని ఓ పరిశ్రమలో పని చేస్తున్న వ్యక్తి(50), కర్నాల్‌పల్లిలో వ్యక్తి(54)కి, కరీంనగర్‌ పంచాయతీ పరిధిలోని కుక్కలగుట్ట తండాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. దీంతో పాజిటివ్‌ వచ్చినవారి ఇండ్ల పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచాకారీ చేయించారు. సన్నిహితంగా ఉన్నవారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

కంచన్‌పల్లిలో విద్యార్థికి..

కౌడిపల్లి : మండలంలోని కంచన్‌పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి(16) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి డా.వెంకటస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

సిద్దిపేటలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట పట్టణంలోని మోహిన్‌పురలో ఒకరికి, హరిహర రెసిడెన్సీలో ఒకరికి, శంకర్‌నగర్‌లో ఒకరికి, సాజిద్‌పురలో ఒకరికి, అంబేద్కర్‌నగర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కొవిడ్‌ -19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

తొగుట మండలంలో ఇద్దరికి కరోనా

తొగుట : మండలంలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన ఒక విద్యుత్‌ ఉద్యోగి, తొగుట సీఐ రవీందర్‌ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తొగుట పీహెచ్‌సీ వైద్యులు వెంకటేశ్‌ తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో ఎస్సై సామ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది వెంట సర్పంచ్‌ గోవర్ధన్‌, కార్యదర్శి భిక్షపతి, ఏఎన్‌ఎం సంతోశ్‌ తదితరులు ఉన్నారు. 

కరోనా కట్టడి చర్యలు...

కొండపాక : కొండపాక మండలం వ్యవసాయ విస్తరణాధికారిణికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో కరోనా కట్టడి చర్యలు చేపట్టారు.  రెండుమూడు రోజుల నుంచి పలు గ్రామాల్లోని కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.  మేథినీపూర్‌లో శనివారం రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు. పలువురు అధికారుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. logo