శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Jul 11, 2020 , 00:02:33

అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు

అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు

పటాన్‌చెరు : అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరులోని గ్రామాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలంలోని క్యాసారం, పెద్దకంజర్ల గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలను అమలు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించామన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రజలందరూ తడి, పొడి చెత్తను వేరు చేస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయని చెప్పారు. హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, సర్పంచ్‌లు రాజ్‌కుమార్‌, పెంటయ్య, ఎంపీటీసీలు రాంచందర్‌, వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

పుల్కల్‌: వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి సర్పంచ్‌లను కోరారు.శుక్రవారం మండల పరిధిలోని ముదిమాణిక్యం. పెద్దారెడ్డిపేటలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాకుంటే చర్యలు తప్పవన్నారు. వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ వెంట ఎంపీడీవో విశ్వప్రసాద్‌,  సర్పంచ్‌లు సతీశ్‌కుమార్‌, అరుణ యాదగిరి పాల్గొన్నారు.

హత్నూరలో...

హత్నూర: హత్నూర మండలం కొన్యాల గ్రామశివారులో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు పనులను అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి  పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం డంపింగ్‌ యార్డు  స్థల సేకరణ చేసి పనులు చురుకుగా చేపట్టడంతో సంతోషం వ్యక్తంచేశారు. జిల్లా వ్యాప్తంగా డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు వందశాతం పూర్తిదశకు చేరుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆంజనేయులు, తహసీల్దార్‌ జయరాం, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.

ఝరాసంగంలో 

ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు కొల్లూర్‌లో శుక్రవారం ఉపాధిహామీ పథకంతో  నిర్మిస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను ఎంపీవో లక్ష్మయ్య  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశాన వాటిక , డంపింగ్‌ యార్డు నిర్మాణం పనులను త్వరగతిన పూర్తి చేస్తామన్నారు.  ఆయన వెంట సర్పంచ్‌ సావిత్ర, ఎంపీటీసీ లక్ష్మి , పంచాయతీ కార్యదర్శులు , శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బస్వరాజ్‌, ఉన్నారు.

మునిపల్లిలో... 

మునిపల్లి : గ్రామాల్లో తడి , పొడి చెత్తను వేరుచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్‌ అన్నారు. మండలంలో ని చిన్నచెల్మెడలోడంపింగ్‌ యార్డును  జడ్పీటీసీ ప్రారంభించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మట్లాడుతూ డం పింగ్‌ యార్డుతో అనేక లభాలు ఉన్నాయని, అందుకు తడి , పొడి చెత్త వేరు చేయడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌ చంద్రకులకర్ణి, గ్రామ సర్పంచ్‌ విజయ్‌భాస్కర్‌, ఉపసర్పంచ్‌ దత్తుగౌడ్‌, ఎంపీటీసీ రాజశేఖర్‌  పాల్గొన్నారు.

పనుల పరిశీలన

కోహీర్‌: మండలంలోని మనియార్‌పల్లిలో పల్లెప్రగతిలో  చేపట్టిన వైకుంఠధామం నిర్మాణాలను ఎంపీడీవో సుజాతనాయక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నిర్మాణాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను వందశాతం కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి నరేశ్‌కుమార్‌ పాల్గొన్నారు .


logo