సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Jul 10, 2020 , 23:55:55

సంగారెడ్డిలో 35 పాజిటివ్‌.. ఒకరు మృతి

సంగారెడ్డిలో 35 పాజిటివ్‌.. ఒకరు మృతి

సిద్దిపేట కలెక్టరేట్‌: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట ఫిష్‌మార్కెట్‌ ఏరియాలో 1, కొమురవెల్లి మండలంలో 1, కొండపాక మండలంలో 1, తొగుట మండలంలో 1, సిద్దిపేట కరీంనగర్‌ రోడ్డులో ఒకరికి  కరోనా పాజిటివ్‌ నిర్ధ్దారణ అయిందన్నారు.

చిన్నకోడూరు మండలంలో కరోనా కలకలం 

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. గ్రామానికి చెందిన వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామీణ వికాస్‌ బ్యాంకు శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. చికిత్సకోసం సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు. వైద్యులు సదరు వ్యక్తి నుంచి రక్తనమూనా సేకరించి పరీక్షకు పంపారు. శుక్రవారం అతడికి  రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా  వచ్చిందని తెలిపారు. అతడిని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అతడి కుమారుడికి మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. అతడి భార్య, కుమారుడు నుంచి రక్తనమూనాలు సేకరించారు.  

14 రోజులు పాటు లాక్‌డౌన్‌ పంచాయతీ పాలక వర్గం తీర్మానం

గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో సర్పంచ్‌ నెమలి సుభాష్‌ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేశారు.  గ్రామంలో 14 రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.  

 కొండపాకలో మహిళా ఉద్యోగికి.. 

కొండపాక: మండలంలోని వ్యవసాయశాఖలో పని చేస్తు న్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధ్ధారణ అయినట్లు మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌ తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగిని ఐసోలేషన్‌కు తరలించినట్లు చెప్పారు.  

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 35 కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో కొత్తగా శుక్రవారం 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి 7, సదాశివపేట 3, జహీరాబాద్‌ 6, నల్లవాగు 4, బీరంగూడ 3, దిగ్వాల్‌ 2, జిన్నారం 1, ఓతేజి 1, నాగిల్‌గిద్ద 1, నందిగామ 1, రాయికోడ్‌ 1, జంగి 1, బొల్లారం 1, మునిపల్లి మండలం 1, పటాన్‌చెరు 1, ఆర్‌సీపురం 1 మొత్తం 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు చెప్పారు. ఇద్దరు దవాఖానలో  పొందుతుండగా, 33 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు  తెలిపారు. సంగారెడ్డి గణేష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (49) హైదరాబాద్‌లోని డెక్కన్‌ దవాఖానలో చికిత్స పొం దుతూ శుక్రవారం మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 

అనుమానితుల శ్యాంపిల్‌ సేకరణ 

న్యాల్‌కల్‌ : మండలంలోని శంశోల్లాపూర్‌ గ్రామంలో శుక్రవారం 11మంది కరోనా అనుమానితుల నుంచి శ్యాంపిల్‌ సేకరించేందకు దవాఖానకు తరలించినట్లు మండల న్యాల్‌కల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి శ్వేతప్రియా తెలిపారు. ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు కర్ణాటకలోని బాల్కిలో దవాఖానలో పనిచేస్తున్న ఉద్యోగి హాజరయ్యారన్నారు. అయితే రెండు రోజుల కింద ఆమెకు అక్కడ వైద్య పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అక్కడి వైద్యాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని ఆమె బంధువులను విచారించి, 11మంది అనుమానితులను  జహీరాబాద్‌ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లాలో మరో రెండు కేసులు

మెదక్‌/తూప్రాన్‌ రూరల్‌ : మెదక్‌ జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జిల్లాలోని అల్లాదుర్గం మండలం చిల్వర్‌ గ్రామానికి చెందిన 40 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా, తూప్రాన్‌ పట్టణంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని చెప్పారు. 

అల్లాదుర్గంలో ఒకరికి.. 

అల్లాదుర్గం: మండలంలోని చిల్వెర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (32) కరోనా పాజిటివ్‌ నిర్ధ్దారణ అయినట్లు మండల వైద్యాధికారి దివ్వజ్యోతి తెలిపారు. సదరు వ్యక్తి వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నెల 7వ తేదీన సంగారెడ్డి ప్రైవేట్‌ దవఖానాలో పరీక్షలు చేయించుకున్నాడు. శుక్రవారం రిపోర్టులో పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు.  అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామానికి వెళ్లి బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచారు.


logo