గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jul 09, 2020 , 23:56:45

పారిశుధ్యంపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

పారిశుధ్యంపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

  •  మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి  l చేగుంట, నార్సింగి, సుతారిపల్లిలో  కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

చేగుంట/రామాయంపేట : పారిశుధ్యంపై నిర్లక్ష్యాన్ని సహించమని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గురువారం చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌తో కలిసి, రామాయంపేట మండలం సుతారిపల్లిలో ఆకస్మికంగా కలెక్టర్‌ పర్యటించారు. ఉదయం 7గంటల నుంచి గ్రామాల్లోని వీధుల్లో తిరిగారు. తడి, పొడి చెత్తను ఏ విధంగా చెత్త బండిలో ఇస్తున్నారో పరిశీలించారు.  రామాయంపేట నర్సరీని పరిశీలించి, డ్వాక్రా సంఘాల మహిళలకు మొక్కలను అందజేశారు. డంపింగ్‌ యార్డు సందర్శించి, తడిపొడి చెత్తపై సిబ్బందిని అడిగారు. తడి, పొడి చెత్తను గ్రామస్తులు వేరు చేసి ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, సుతారిపల్లి సర్పంచ్‌ సంధ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, సిబ్బందిని అభినందించారు. నల్లాలకు తీసిన గుంతలను పరిశీలించారు. ప్రతి రోజు చెత్త సేకరణకు సిబ్బంది వస్తున్నారా? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సర్పంచ్‌, కార్యదర్శితో పాటు అధికారులు పని చేస్తున్నారా? అని ఆరా తీశారు. ఇంటికి వచ్చిన చెత్త బండికి తడి, పొడి చెత్తను వేరు చేసి మాత్రమే ఇవ్వాలన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా కలెక్టర్‌ మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖాల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు ఉమాదేవి, ఆనంద్‌మేరీ, గిరిజారాణి, ఎంపీపీలు శ్రీనివాస్‌, సబిత, భిక్షపతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నార్సింగి అధ్యక్షుడు ఎర్రం అశోక్‌, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, సుజా త, సత్యనారాయణ, ఈవోలు రాణి, నరేశ్‌, ఉప సర్పంచ్‌ సురేఖ, వార్డు సభ్యులు, ఐకేపీ ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.logo