బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 08, 2020 , 23:24:35

‘నిమ్జ్‌'పై రేపు ప్రజాభిప్రాయం

‘నిమ్జ్‌'పై రేపు ప్రజాభిప్రాయం

 జహీరాబాద్‌ : జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్‌)లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం కొవిడ్‌-19 నిబంధన ప్రకారం సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సభావేదిక వద్ద రసాయనాల పిచికారీ,  సమావేశంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనుమతి ఇస్తామని, శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా అందజేస్తామని తెలిపారు.  సీట్ల వరుల మధ్యలో కొవిడ్‌ నిబంధనలు తప్పక అమలు చేస్తామన్నారు.  

సభా స్థలాన్ని పరిశీలించిన అడిషినల్‌ కలెక్టర్‌ 

ఝరాసంగం : 10న ఝరాసంగంతో పాటు న్యాల్‌కల్‌ మండలంలోని 18 గ్రామాల రైతులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు, జిల్లా అడిషి నల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి,  తహసీల్దార్‌ తారాసింగ్‌ అన్నారు. బుధవారం  సభా స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ రెండు మండలాల నుంచి జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్‌)  నిర్మాణం కోసం సేకరించిన   భూముల రైతులతో  ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  రైతులకు ఎలాంటి అభ్యంతరాలు  ఉన్నా తెలుపాలన్నారు. అందుకు సభా స్థలం వద్ద రెండు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, పోలీస్‌ బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. వారి వెంట జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌ బాబు, ఎంపీడీవోలు సుజాత, వత్సలదేవి, ఆ యా శాఖాల అధికారులు ఉన్నారు. 


logo