శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Jul 07, 2020 , 23:24:41

హత్య కేసును చేధించిన పోలీసులు

హత్య కేసును చేధించిన పోలీసులు

నారాయణఖేడ్‌ టౌన్‌: నారాయణఖేడ్‌ ఎస్‌బీఐ శాఖలో  విధులు నిర్వహిస్తున్న మునుస్వామి హత్య కేసును పోలీసులు చేధించారు. మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్సీ సత్యనారాయణరాజ్‌ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భవానీ కాలనీలో నివాసముంటున్న మునుస్వామి మొదటి భార్య అనారోగ్యంతో మృతిచెందగా, నారాయణఖేడ్‌లోని మన్సూర్‌పూర్‌కు చెందిన కొండాపూర్‌ నర్సింహులు కూతురు సంత్‌బాయిని రెండో పెండ్లి చేసుకున్నాడు. మునుస్వామికి భవానీ కాలనీలో ఆర్‌సీసీ బిల్డింగ్‌ ఉండగా, బిల్డింగ్‌ను సంత్‌బాయి తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయించాలని కోరింది. భర్త మునుస్వామి రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య సంత్‌బాయి ఖేడ్‌కు చెందిన నసీర్‌మియా వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భర్తను ఎలాగైనా అంతమొందించాలని నసీర్‌మియాకు చెప్పింది. ఈ నెల 4న అర్ధరాత్రి సంత్‌బాయి నసీర్‌మియాకు ఫోన్‌చేసి ఇంటికి పిలిచింది. మునుస్వామి నిద్రలో ఉండగా, ఇద్దరు కలిసి చున్నీతో గొంతుకు బిగించి సుత్తెతో తలపై బలంగా కొట్టగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.  మంగళవారం ఉదయం 9గంటలకు మృతుడి భార్య సంత్‌బాయి, నసీర్‌మియా బీదర్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా,  సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం బయట పడింది. కార్యక్రమంలో సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై సందీప్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. 

 


logo