శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Jul 07, 2020 , 23:16:04

ప్రభుత్వం నిర్ణయం మేరకు తరగతుల నిర్వహణ

ప్రభుత్వం నిర్ణయం మేరకు తరగతుల నిర్వహణ

పుల్కల్‌ : కళాశాలల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించే బాధ్యతను అధ్యాపకులు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలోని కళాశాల ఆవరణలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   అధ్యాపకులు, సిబ్బంది విరివిగా మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సెట్‌లు, తరగతుల నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామని ఆయన తెలిపారు.logo