మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jul 07, 2020 , 02:20:24

హరితమయం చేద్దాం

హరితమయం చేద్దాం

  • ఊరూరా  మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

రామాయంపేట: కాట్రియాల గ్రామాన్ని హరితవనంగా మా రుస్తానని  సర్పంచ్‌ మైలారం శ్యాములు, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్‌ అన్నారు. సోమవారం ఆరో విడుత హరితహారం లో భాగంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయం, ప్రధా న కూడళ్లల్లో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు అందజేశారు. పర్యావరణం పరిరక్షణకు   మొక్కలు నాటాలన్నారు.  కాట్రియాల గ్రామాన్ని మనందరం కలిసి హరిత మయంగా చేద్దామన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్నారు. అనంతరం గ్రామంలోని సీసీ డ్రైన్‌ నిర్మాణాన్ని చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ స్రవంతి, వార్డు సభ్యుడు శ్యామ్‌, కార్యదర్శి రాములు, డ్వాక్రా సం ఘాల నాయకురాళ్లు ఉన్నారు. 

పెండింగ్‌ పనులు   పూర్తి చేయాలి 

మనోహరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వర గా పూర్తి చేయాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేట మండలం పోతులబోగుడలో డంపింగ్‌యార్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వీలైనంత త్వరగా మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలను పూర్తి చేయాలన్నారు.  అన్ని డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల వద్ద ఖాళీ స్థలాలు కనిపించకుండా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

వెల్దుర్తి: గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండలంలోని రామాయిపల్లిలో మల్లన్న దేవాలయం వద్ద హరితహారం మొక్కలు నాటి, జడ్పీ నిధులతో వేసిన బోరు మోటర్‌ను ప్రారంభించారు.    హారితహారంలో భాగంగా గ్రామ గ్రామానా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేశారన్నారు. అంతకుముందు వైకుంఠధామం, రైతువేదిక నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ఎస్సై గంగరాజు, సర్పంచ్‌ నారాయణ, నాయకులు నరేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సింలు, లింగం పాల్గొన్నారు.


logo