గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jul 07, 2020 , 02:20:46

నూతన ఆవిష్కరణలు

 నూతన ఆవిష్కరణలు

సంగారెడ్డి మున్సిపాలిటీ :  సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్తలు, సిబ్బంది ఎంతో కృషి చేసి నూతన ఆవిష్కరణలను సమాజానికి, వ్యవసాయ రంగానికి అందిస్తున్నారని అగ్రికల్చర్‌ ప్రొడక్షన్‌ కమిషనర్‌, కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఇన్‌చార్జి డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రిన్సిపల్‌  హెడ్‌ డాక్టర్‌ ఏ.భగవాన్‌ ఫల పరిశోధన కేంద్రం చరిత్ర, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్‌కు వివరించారు. ఫల పరిశోధన కేంద్రంలో 161 ఎకరాల మామిడి, జామ, సపోట, సీతాఫలం చెట్లకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. నర్సరీ నుంచి ప్రతి ఏడాది 1.5 లక్షల మొక్కలను విక్రయాలు చేపడుతున్నామని డాక్టర్‌ భగవాన్‌ తెలిపారు.  


logo