గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jul 06, 2020 , 00:08:44

మొక్కలు నాటుదాం.. భావితరాలను కాపాడుదాం..

మొక్కలు నాటుదాం.. భావితరాలను కాపాడుదాం..

అమీన్‌పూర్‌ : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. ఆదివారం హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు రవీంద్రప్రసాద్‌ రెసిడెన్సీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను కాపాడటం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, వార్డు కౌన్సిలర్లు యూసుఫ్‌, నవనీత జగదీశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

మొక్కలు నాటుదాం.. భావితరాలను కాపాడుదాం..

రామచంద్రాపురం : మొక్కలు నాటి భావితరాలను కాపాడుదామని భారతీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌ సింధూఆదర్శ్‌రెడ్డి, ఆర్సీపురం డివిజన్‌ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌ పిలుపునిచ్చారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జన్మదినం సందర్భంగా హెచ్‌ఐజీ కాలనీలో బల్దియా అధికారులతో కలిసి కార్పొరేటర్లు 300 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేయర్‌ బొంతు జన్మదినం సందర్భంగా హెచ్‌ఐజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పారు. రాష్ర్టాన్ని హరితవనంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ హరితహారానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడకుండా అన్నివర్గాల ప్రజలు భాగస్వాములై ఉద్యమంలా మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఉపకమిషనర్‌ బాలయ్య, ఈఈ సుదర్శన్‌, బీఎన్‌రెడ్డి, రామకృష్ణ, ఖాజా, ఆసిఫ్‌, బాబా, చారి తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ మొక్కల పంపిణీ..

గుమ్మడిదల : హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఆదివారం మండలంలోని బొంతపల్లి పంచాయతీ పరిధిలోని వీరభద్రనగర్‌ కాలనీలో బ్యాంకు మిత్ర ఏపీఎం శివకుమార్‌ ఇంటింటికీ తిరుగుతూ మొక్కలు అందజేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 


logo