శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jul 05, 2020 , 00:58:09

డంపింగ్‌ యార్డులను పూర్తి చేయాలి

డంపింగ్‌ యార్డులను పూర్తి చేయాలి

  • అసిస్టెంట్‌ విజిలెన్స్‌ మేనేజర్‌ స్వర్ణలత

కొండపాక : మండలంలోని కుకునూర్‌పల్లి, సిర్సినగండ్ల గ్రా మాల్లో పారిశుధ్య నిర్వహణపై శనివారం అసిస్టెంట్‌ విజిలెన్స్‌ మేనేజర్‌ స్వర్ణలత ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కుకునూర్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉపకేంద్రాన్ని పరిశీలించారు. డంపింగ్‌ యార్డు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, మురుగునీటి కాల్వలను పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని పరిసరాల నిర్వహణ చూశారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. కరోనాపై ప్రజల్లో ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సిర్సినగండ్లలో  పర్యటించి, డంపింగ్‌ యార్డును సందర్శించి, చెత్తను తడి, పొడిగా వేరుచేసే విధానాన్ని పరిశీలించారు. ఆమె వెంట కుకునూర్‌పల్లి సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతి, కార్యదర్శి హరిప్రసాద్‌, పీఎన్‌ఆర్‌ సంస్థ అధినేత నరేందర్‌, సిర్సినగండ్ల సర్పంచ్‌ లక్ష్మారెడ్డి ఉన్నారు.

అందుబాటులోకి తేవాలి : రాజనర్సు

సిద్దిపేట కలెక్టరేట్‌ : మున్సిపల్‌లోని బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డును మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు పరిశీలించారు. డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను పరిశీలించి, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. చైర్మన్‌ వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌, కాంట్రాక్టర్‌ విజయభాస్కర్‌ ఉన్నారు.  


logo